అనంతపురం జిల్లా.
– అనంతపురం కలెక్టరేట్ లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో బుధవారం రాఘవేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (RIPER – అటానమస్) ఎన్.ఎస్.ఎస్ (NSS) విభాగం, మై భారత్ (MY Bharat) మరియు జిల్లా యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘జిల్లా స్థాయి వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్-2026’ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ ఆవిష్కరించారు.
– ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. యువతలో నాయకత్వ లక్షణాలను, సామాజిక బాధ్యతను పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. ఈ జిల్లా స్థాయి పోటీలను రైపర్ కళాశాల వేదికగా నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.
– ఇప్పటికే ‘మై భారత్’ (MY Bharat) పోర్టల్‌లో తమ పేర్లను నమోదు చేసుకున్న విద్యార్థులు (Registered Students) అందరూ మార్చి 5వ తేదీన ఉదయం నిర్ణీత సమయానికి RIPER కళాశాలలోని పోటీ వేదికకు చేరుకోవాలని నిర్వాహకులు సూచించారు.
– ఈ కార్యక్రమంలో నెహ్రూ యువకేంద్రం డిడిఓ శ్రీనివాస్, రైపర్ కళాశాల ప్రిన్సిపాల్ డా.వై.పద్మనాభ రెడ్డి, రైపర్ వైస్ ప్రిన్సిపాల్ డా. జె.రవీంద్ర రెడ్డి, జేఎన్టీయూఏ ఎన్.ఎస్.ఎస్ కో-ఆర్డినేటర్ డాక్టర్ జి.మమత, మై భారత్ రాష్ట్ర కో-ఆర్డినేటర్ బిసతి భరత్, మై భారత్ అకౌంట్స్ అండ్ ప్రోగ్రామ్ సూపర్‌వైజర్ జి.శ్రీనివాసులు, రైపర్ ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ బి.నాగశుభ మరియు తదితరులు పాల్గొన్నారు.
