మహిళల కోసం కేంద్రం కొత్త స్కీమ్, పదో తరగతి పాసైతే చాలు జాబ్..

మహిళల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త కొత్త పథకాలు తెస్తున్నాయి. లేటెస్ట్‌గా డిసెంబర్ 9న కొత్త స్కీమ్‌ని తీసుకొచ్చింది మోదీ సర్కార్. ఒక్కమాటలో చెప్పాలంటే ఇంట్లో కూర్చొని మహిళలు డబ్బులు సంపాదించడం అన్నమాట. అందులో సక్సెస్ అయితే జాబ్ హోలర్డ్‌గా మార్చుకుంది. ఈ స్కీమ్ ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు ఆర్థిక సహాయం చేయడమే దీని ముఖ్యఉద్దేశం.

 

కేంద్రప్రభుత్వం ఎల్ఐసీతో కలిసి మహిళల కోసం కొత్త స్కీమ్‌ని తీసుకొచ్చింది. అందే బీమా సఖీ యోచన. దీన్ని డిసెంబర్ 9న ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. ఇందులో మహిళ కాస్త కష్టపడితే ఎల్ఐసీ ఉద్యోగం చేయవచ్చు. అదెలా అనుకుంటారా? అక్కడికే వచ్చేద్దాం. ఇంతకీ ఈ స్కీమ్ కండీషన్స్ ఏంటి? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..

 

ఎల్ఐసీ బీమా సఖీ యోజన గ్రామీణ మహిళలకు కొత్త జీవనోపాధి. అవకాశాలను సృష్టించడమే కాకుండా దేశంలో వెనుకబడిన ప్రాంతాలలో బీమా సదుపాయాన్ని మెరుగుపరచడం అన్నమాట. గ్రామీణ మహిళలు బీమా ఏజెంట్లుగా మారడం ద్వారా జీవనోపాధి పొందవచ్చు. ఏడాదిలోపు 100,000 బీమా సఖీలను, మరో మూడేళ్లలో రెండు లక్షల మందిని చేర్చుకోవాలని భావిస్తోంది.

 

ఈ పథకంలో చేరాలనుకునే మహిళలు కనీసం 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి. ఈ స్కీమ్ 18 నుండి 70 సంవత్సరాల వయస్సు గల మహిళలకు మాత్రమే. మూడేళ్లలో 200,000 మందిని నమోదు చేయాలని యోచిస్తోంది. ఈ స్కీమ్ వ్యవధి కేవలం మూడేళ్లు మాత్రమే. ఇందుకోసం ఎల్ఐసీ ఉచితంగా ట్రైనింగ్ ఇస్తుంది. ఆ తర్వాత ఎగ్జామ్‌లో పాసైతే ఏజెంట్ అయిపోయినట్టే.

 

తొలి ఏడాది ప్రతీ నెల 7 వేలు చొప్పున స్టయిఫండ్ ఇస్తుంది. ఏడాదికి 84 వేలు వస్తుంది. ఇక పాలసీలు కట్టించినా, కట్టించపోయినా ఈ మొత్తాన్ని మీ అకౌంట్లో వేస్తుంది. పాలసీలు కట్టిస్తే కమిషన్ కూడా వస్తుంది. రెండో ఏడాది కాస్త తగ్గుతుంది. 6 వేలు స్టయిఫండ్ ద్వారా 72 వేలు వస్తుంది. థర్డ్ ఇయర్ వచ్చేసరికి 5 వేలు రూపాయలు స్టయిఫండ్ ద్వారా 60 వేలు వస్తుంది. ప్లస్ పాలసీలు కట్టిస్తే కమిషన్ కూడా వస్తుంది.

 

మూడేళ్ల తర్వాత ఎలాంటి స్టయిఫండ్ రాదు. ఒకవేళ డిగ్రీ చదివిన మహిళయితే మూడేళ్ల తర్వాత ఎగ్జామ్ రాసి పాసైతే ఎల్ఐసీలో డెవలప్‌మెంట్ ఆఫీసుగా మారవచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే ఎల్ఐసీలో జాబ్ అన్నమాట. తొలి ఏడాదిలో 24 పాలసీలు అమ్మితే దాదాపు 40 వేల పైచిలుకు కమిషన్ మనకు వస్తుంది. అదే సెకండ్, థర్డ్ ఇయర్‌లో ఆ పాలసీలను 65 శాతం మంది రెన్యువల్ చేస్తే అప్పుడు కమిషన్ కూడా వస్తుంది.

 

ఇంట్లో ఎవరైనా ఎల్ఐసీలో ఉద్యోగం చేస్తున్నారో వారు దీనికి అనర్హులు. ఆధార్, ఎడ్యుకేషన్‌ సరిఫికెట్స్ ( పది ఆపై ఇంటర్, డిగ్రీ), అడ్రస్‌కు రేషన్ కార్డు చాలు. ఇవన్నీ తీసుకుని ఎల్ఐసీ ఆఫీసుకు వెళ్లవచ్చు. లేదంటే ఎల్ఐసీ సైట్లో నేరుగా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.

Editor