రెండోపెళ్లి గురుంచి సమంత హింట్..?

దక్షిణాది బ్యూటీ సమంత ప్రస్తుతం సిటాడెల్ రీమేక్ హనీబన్నీ వెబ్ సిరీస్ ప్రమోషన్లలో పాల్గొంటోంది. దేశవ్యాప్తంగా ప్రయాణం చేస్తూ ఇంటర్వ్యూలిస్తోంది. నవంబరు ఏడోతేదీన అమెజాన్ ప్రైమ్ లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ ప్రారంభం కాబోతోంది. సమంతతోపాటు దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే కూడా ఇంటర్వ్యూలిస్తున్నారు. షూటింగ్ సమయంలో సమంత పడిన కష్టాన్ని దర్శకులు చెబుతున్నారు. సిరీస్ కచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. హీరోగా వరుణ్ ధావన్ నటించాడు. ఇంటర్వ్యూల్లో విలేకరుల నుంచి ఎదురవుతున్న ప్రశ్నలకు ఓపికగా, ధీటుగా సమాధానాలిస్తోంది సమంత.

 

సమంతపై ప్రశంసలు

అలాగే తన రెండో పెళ్లికి సంబంధించిన ప్రశ్న ఎదురైనప్పుడు స్పందించింది. తాను ఎంతో ఇష్టపడి, ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకున్నానని, ప్రస్తుతం విడిపోయామని, తన జీవితంలో ఇక రెండో పెళ్లి అనే ప్రసక్తి కానీ, మరో వ్యక్తికానీ ఎవరూ ఉండరని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేసింది. దీంతో అందరూ సమంతపై ప్రశంసలు కురిపిస్తున్నారు. విడిపోయిన కొన్నాళ్లకే శోభిత ధూళిపాళను నాగచైతన్య వివాహం చేసుకుంటున్నాడని, కానీ ప్రేమను, వివాహాన్ని మర్చిపోలేక సమంత మాత్రం అలా చేయలేకపోతోందని, బయటకు కనపడకపోయినప్పటికీ ఇప్పటికీ మానసికంగా దిగులుపడుతోందనే విషయం అర్థమవుతోందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

 

విడిపోవడానికి ఇవే కారణాలంటూ వార్తలు

నాగచైతన్య-సమంత విడిపోవడానికి ఫ్యామిలీమ్యాన్ వెబ్ సిరీస్ చేయడమే కారణమని ఒక వార్త రాగా, జాను సినిమా వద్దని చెప్పినా చేసిందని, అక్కడే విభేదాలు మొదలయ్యాయని మరోవార్త, నాగచైతన్య శోభితతో సన్నిహితంగా మెలగడం మరో కారణమంటూ… ఇలా రకరకాలుగా వార్తలు వచ్చాయి. అసలు విషయం మాత్రం వారిద్దరికే తెలియాలి. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోతున్నామంటూ సింపుల్ గా వారిద్దరూ చెప్పేశారు. సామాజిక మాధ్యమాల్లో మాత్రం అంతులేని కథల్లా, ముగింపు లేని సీరియల్స్ లా వీరిపై కథనాలు వస్తూనే ఉన్నాయి. సమంత, నాగచైతన్యకు సంబంధించి సోషల్ మీడియాలో ఎటువంటి వార్త వచ్చినా అది వైరలవుడం మాత్రం కచ్చితంగా జరుగుతోంది.

Editor