దేవర సినిమా పై ఆడియన్స్ రియాక్షన్..

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసిన దేవర జాతరే కొనసాగుతుంది. గత ఆరేళ్లుగా ఎన్టీఆర్ సోలో సినిమా కోసం ఎదురు చూసిన ఫ్యాన్స్ ఎదురు చూపులకు ఎట్టకేలకు నేడు ఫుల్ స్టాప్ పడింది. ఎన్నో రోజులుగా ఊరిస్తూ మూవీపై పెంచిన హైప్ కి ఏమాత్రం తగ్గకుండా సినిమా ఇవాళ థియేటర్లలోకి వచ్చి సందడి చేస్తుంది. అర్ధరాత్రి 1 గంటకు మొదటి షో పడింది. మొదటి షోతోనే దేవర బ్లాక్ బాస్టర్ అనే టాక్ ను సొంతం చేసుకుంది.. ఫ్యాన్స్ నిరీక్షణ ఫలించింది. ఇక ఆచార్య తర్వాత కొరటాల శివ తెరకెక్కించిన దేవర మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉందో ఇప్పుడు ఒకసారి చూసేద్దాం…

 

దేవర సినిమా పై ఆడియన్స్ రియాక్షన్..

 

ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలలో గ్రాండ్ గా రీలిజ్ అయింది. అత్యంత భారీ బడ్జెట్ తో రిలీజైన దేవరతో ఎన్టీఆర్ హిట్ కొట్టాడా..? ఆచార్య ప్లాప్ తర్వాత కొరటాల ఎలాంటి కథతో ఆడియన్స్ ముందుకొచ్చాడు..? రాజమౌళితో చేసిన హీరోల ఫెయిల్యూర్స్ సెంటిమెంట్ ను ఎన్టీఆర్ దేవరతో బ్రేక్ చేశాడా? అనే విషయాలు నిన్నటివరకు ఫ్యాన్స్ ను కలచివేసాయి. మొదటి షో నుంచి దేవర టాక్ పాజిటివ్ గానే ఉండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. దేవర సినిమా పై ఆడియన్స్ రియాక్షన్ బాగుండటంతో సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ పక్కా అనే టాక్ తెలుగు రాష్ట్రాల్లో గట్టిగా వినిపిస్తుంది. అలాగే ఈ సినిమా బాహుబలిలో లాగే తండ్రి కొడుకులు అని చూపించారు, జాన్వికపూర్ పెర్ఫార్మన్స్ బాగుందని పబ్లిక్ చెబుతున్నారు.

 

దేవరగా ఎన్టీఆర్‌, భైరగా సైఫ్ అలీఖాన్ పాత్రలు పోటాపోటీగా సాగుతాయని చెబుతున్నారు.ఎర్ర సముద్రం తీర ప్రాంతంలో భారీ కంటైనర్ షిప్‌లపై వచ్చే ఖరీదైన సామాగ్రిని దొంగతనం చేసే నాలుగు ఊళ్ల ప్రజల జీవితాల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని అంటున్నారు. స్టోరీ సింపుల్‌గానే ఉన్నా తన స్క్రీన్‌ప్లేతో కొరటాల శివ మ్యాజిక్ చేశాడని అంటున్నారు. ఇక సినిమాకు మ్యూజిక్ హైలెట్ గా నిలిచిందని చెబుతున్నారు.. అలాగే పాటలు చూడటానికి చాలా బాగున్నాయట. జాన్వీ కపూర్ ఎంట్రీ సీన్ కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందట. అండర్ వాటర్ సీక్వెన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ , ఇంటర్వెల్ బ్లాక్.. ఫస్ట్ హాఫ్ కి హైలెట్ అంటున్నారు. ద్విపాత్రాభినయం చేసిన ఎన్టీఆర్ రెండు రోల్స్‌ని చించేస్తూ.. మరోసారి ఆల్ రౌండర్ అనిపించుకున్నాడట ఎన్టీఆర్.. ఇక సెకండాఫ్ యాక్షన్ సీన్స్ ఇష్టపడేవారికి ఫుల్ మీల్స్ పెట్టిదంట. రెండు ఫైట్లు చాలా అద్భుతంగా వచ్చాయని.. అవి దేవర సినిమాను మరో మెట్టు ఎక్కించి ఎక్కడికో తీసుకువెళ్లాయని ఆడియన్స్ చెబుతున్నారు. ఇక ఎన్టీఆర్ చెప్పినట్లు చివరి 40 నిమిషాలు ఫ్యాన్స్ ను కదలకుండా చేసిందనీ పబ్లిక్ చెబుతున్నారు.. మొత్తానికి ఆడియన్స్ రియాక్షన్ చూస్తుంటే సినిమా హిట్ అయ్యిందనే అనిపిస్తుంది.. ఇక ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ ఎప్పుడో వచ్చేసిందని టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది.. ఇక మల్టీఫ్లెక్స్ లలో 42 షోలు పడటంతో కలెక్షన్ ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు..

Editor