మెగాస్టార్ ‘విశ్వంభర’ టీజర్ అప్డేట్..!

టాలీవుడ్‌ నుంచి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ ఒకటి. ‘బింబిసార’ డైరెక్టర్ వశిష్ట ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇది మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో 156వ చిత్రంగా రూపుదిద్దుకుంటోంది. ఇందులో మెగాస్టార్‌కు జోడీగా సీనియర్ హీరోయిన్ త్రిష నటిస్తుంది. అలాగే ఈ హీరోయిన్‌తో పాటు మరో 5గురు నటీమణులు ఇందులో భాగం కానున్నట్లు తెలుస్తోంది.

 

అందులో కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ ఒకరు. ఇటీవలే ఆమె బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేస్తూ అధికారికంగా తెలిపారు. ఈమెతో పాటు మరో ముగ్గురు కూడా ఇందులో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వారు చిరంజీవికి జోడీగా నటిస్తారా? లేక మరేదైన పాత్ర పోషిస్తారా అనేది చూడాలి. ఇకపోతే ఈ మూవీ కోసం మెగాస్టార్ చాలా కష్టపడుతున్నాడు. గతంలో ‘భోళా శంకర్’ భారీ అంచనాలతో వచ్చినా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఇప్పుడు ‘విశ్వంభర’తో ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడు.

 

ఇందులో భాగంగానే జిమ్‌లో వర్కౌట్ చేస్తూ తెగ కష్టపడుతున్నాడు. కుర్ర హీరోలతో సమానంగా ఎక్కడా తగ్గడం లేదు. ఇక ఫుల్ స్వింగ్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇప్పటికే సంగం కంప్లీట్ అయిపోయింది. పూర్తి షూటింగ్‌ని వచ్చే నెల ఆగస్టు చివరినాటికి కంప్లీట్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఓ వైపు షూటింగ్ జరుపుకుంటూనే మరోవైపు డబ్బింగ్, ఎడిటింగ్ పనులు చకచకా జరుగుతున్నాయి. కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్‌లు అందించి సర్‌ప్రైజ్ చేశారు. పోస్టర్లు, గ్లింప్స్ రిలీజ్‌తో సినిమా రేంజ్‌ మారిపోయింది.

 

‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ తర్వాత చిరు కేరీర్‌లో వస్తున్న మరో ఫాంటసీ సినిమా ‘విశ్వంభర’. దీంతో అందరిలోనూ ఆసక్తి పెరిగింది. అదీగాక ఇప్పుడంతా ఇలాంటి సినిమాలపై ప్రేక్షకాభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో మరింత హైప్ క్రియేట్ అయింది. ఇక ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఇందులో భాగంగానే తాజాగా ఓ వార్త వారిలో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. వచ్చే నెల అంటే ఆగస్టు 22న మెగాస్టార్ చిరు బర్త్ డే. ఈ సందర్భంగా విశ్వంభర సినిమా టీజర్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తతో అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. కాగా అన్ని పనులు పూర్తి చేసి ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది 2025 జనవరి 10న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ గతంలో చెప్పారు.

Editor