అమల్లోకి GRAP-స్టేజ్ IV.. ఢిల్లీలో మరింత క్షీణిస్తున్న గాలి నాణ్యత..

నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR) అంతటా గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP)-స్టేజ్ IVని తక్షణమే అమలులోకి తెచ్చినట్లు ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ (CAQM) ఆదివారం ప్రకటించింది. ఈ ప్రాంతంలో గాలి నాణ్యతలో కొనసాగుతున్న క్షీణతను ఎదుర్కోవడమే లక్ష్యమని పేర్కొంది.

 

స్టేజ్ I నుంచి III క్రింద ఇప్పటికే ఉన్న పరిమితులకు అదనంగా.. స్టేజ్ IV చర్యలు అమలు చేస్తామని ఎయిర్ క్వాలిటీ కమిషన్ పేర్కొంది. ఈ విషయాన్ని CAQM అధికారిక నోటిఫికేషన్‌లో వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న గాలి నాణ్యతను దృష్టిలో ఉంచుకుని.. ఈ ప్రాంతంలో గాలి నాణ్యత మరింత క్షీణించకుండా నిరోధించే ప్రయత్నంలో సబ్-కమిటీ అన్ని చర్యలను అమలు చేయడానికి పిలుపునిచ్చిందని తెలిపింది. GRAP ‘సివియర్ +’ ఎయిర్ క్వాలిటీ (ఢిల్లీ AQI > 450) స్టేజ్-IV.. NCRలో తక్షణమే అమలులోకి వస్తుందని పేర్కొంది. ఇది GRAP స్టేజ్ 1, స్టేజ్ II, స్టేజ్ III కింద పేర్కొన్న నివారణ, నిర్బంధ చర్యలకు అదనం.

 

కాలుష్య స్థాయిలు పెరుగుతూనే ఉన్నందున, ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ .. GRAP-4ని ఖచ్చితంగా అమలు చేయడానికి అన్ని సంబంధిత శాఖలతో సోమవారం సమావేశాన్ని నిర్వహించనున్నారు

Editor