Latest Posts

: వివేక హత్య కేసులో సహ నిందితుడుగా వైయస్ అవినాష్ రెడ్డి

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి ( YS Vivekananda Reddy) హత్య కేసులో సిబిఐ( CBI) దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ కేసులో ఆదివారం వైయస్ భాస్కర్ రెడ్డిని అరెస్టు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

ఆయన రిమాండ్ రిపోర్టులో వైయస్ అవినాష్ రెడ్డి( YS Avinash Reddy)ని సహ నిందితుడుగా చేర్చింది. ఇప్పటివరకు ఈ కేసులో అవినాష్ రెడ్డిని సిబిఐ నాలుగు సార్లు విచారించగా సాక్షిగానే వాంగ్మూలం రికార్డ్ చేసింది.

అయితే వివేక హత్య తర్వాత సహ నిందితులు శివ శంకర్ రెడ్డి, ఉదయ్ రెడ్డి, అవినాష్ రెడ్డి తో కలిసి భాస్కర్ రెడ్డి ఆధారాలను ధ్వంసం చేయడంలో కీలక పాత్ర పోషించినట్లు అభియోగం మోపారు. దీంతో తొలిసారిగా అవినాష్ రెడ్డిని నిందితుల జాబితాలో సిబిఐ చేర్చింది. ఇప్పటికే సిబిఐ ముందు మరోసారి హాజరు కావాలంటూ ఆదివారం అవినాష్ కి సిబిఐ నోటీసులు పంపింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆయన సిబిఐ ఎదుట హాజరు కానున్నారు.

నెక్స్ట్ ఏంటి?

వైయస్ భాస్కర్ రెడ్డి అరెస్టు అవినాష్ రెడ్డి విచారణ నేపథ్యంలో నెక్స్ట్ ఏం జరగబోతుందన్న విషయంపై పులివెందులలో హై టెన్షన్ నెలకొంది. మధ్యాహ్నం అవినాష్ విచారణ తర్వాత కీలక పరిణామం చోటు చేసుకోనుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

YES9 TV