ఇండియన్ 2 – సిద్ధార్థ్ ఫస్ట్ లుక్ రిలీజ్

శంకర్, కమల్ హాసన్ క్రేజీ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ఇండియన్ 2. చాలా డిలే తర్వాత షూటింగ్ శరవేగంగా సాగుతోన్న ఈ చిత్రానికి సంబంధించిన సిద్ధార్థ్ లుక్ ఈరోజు విడుదలైంది.

సిద్ధార్థ్ ఈరోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్న విషయం తెల్సిందే. ఈ సందర్భంగా సిద్ధార్థ్ కూల్ లుక్ ను విడుదల చేసారు.

బైక్ పై బ్యాగ్ తో హ్యాపీగా ఫోజులిస్తోన్న సిద్ధార్థ్ లుక్ ఇంప్రెస్ చేస్తోంది. ప్రస్తుతం కమల్ హాసన్ ఆఫ్రికా దేశంలో చిల్ అవుతోన్న విషయం తెల్సిందే.

త్వరలో ఇండియన్ 2 కు సంబంధించిన మరో భారీ అప్డేట్ ను టీమ్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అలాగే ప్రియా భవానీ శంకర్, సముద్రఖని, బాబీ సింహా తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

YES9 TV