Vivo T5: 7.99mm స్లిమ్ డిజైన్‌తో కొత్త స్మార్ట్‌ఫోన్.. భారీ బ్యాటరీ, AI ఫీచర్లతో లాంచ్

చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో భారత మార్కెట్లో తన T సిరీస్‌లో భాగంగా కొత్తగా Vivo T5ను విడుదల చేసింది. పనితీరు, ఆన్-డివైస్ ఏఐ సామర్థ్యాలు, భారీ బ్యాటరీ, అధిక రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే వంటి ఫీచర్లపై కంపెనీ ప్రధానంగా దృష్టి సారించింది. రోజువారీ వినియోగంతో పాటు మల్టీటాస్కింగ్, ఎంటర్‌టైన్‌మెంట్‌కు అనుకూలంగా ఈ ఫోన్‌ను రూపొందించినట్లు కంపెనీ పేర్కొంది.

డిజైన్ పరంగా కూడా Vivo T5 ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కేవలం 7.99 మిల్లీమీటర్ల మందం, 199 గ్రాముల బరువుతో స్లిమ్, తేలికైన బాడీని కలిగి ఉంది. అధిక రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే ఉండటంతో స్క్రోలింగ్, వీడియోలు, గేమింగ్ సమయంలో మెరుగైన విజువల్ అనుభూతిని అందించేలా ఫోన్‌ను రూపొందించారు.

ఇక భారీ బ్యాటరీతో పాటు ఆన్-డివైస్ ఏఐ సామర్థ్యాలు Vivo T5లో మరో ప్రధాన హైలైట్‌గా నిలిచాయి. ఇంటర్నెట్‌పై పూర్తిగా ఆధారపడకుండా కొన్ని AI ఫీచర్లను నేరుగా డివైస్‌లోనే ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. పనితీరు, బ్యాటరీ లైఫ్, స్లిమ్ డిజైన్, AI ఫీచర్లను కలిపి అందించడం ద్వారా భారత మార్కెట్లో యువ వినియోగదారులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా వివో ఈ కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది.

Editor