ముదిగుబ్బ మండలంలో 2026–27 విద్యా సంవత్సరానికి అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టుకు అర్హులైన అభ్యర్థులు ఈ నెల 21వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని మండల విద్యాశాఖ అధికారి తెలిపారు. ఈ ఏడాది రాళ్ల అనంతపురం ప్రాథమిక పాఠశాలలో ఒక అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు.
అర్హత కలిగిన అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 21లోపు ముదిగుబ్బ మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) కార్యాలయంలో అందజేయాలని కోరారు.
