జువెనైల్ జస్టిస్ బోర్డు సభ్యుడిగా యద్దలపల్లి శ్రీనివాసులు పునర్నియామకం

ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండలం వల్లిమి చెర్లోపల్లి గ్రామానికి చెందిన యద్దలపల్లి శ్రీనివాసులు అనంతపురం జిల్లా జువెనైల్ జస్టిస్ బోర్డు (JJB) సభ్యుడిగా రెండోసారి పునర్నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనను మరోసారి సభ్యుడిగా నియమించింది.

ఈ సందర్భంగా ముదిగుబ్బ మండలానికి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు, శ్రీనివాసులు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. బాలల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, పునరావాసం కోసం తన వంతు బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని శ్రీనివాసులు తెలిపారు.

తన పునర్నియామకానికి సహకరించిన పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్‌తో పాటు ముదిగుబ్బ మండల టీడీపీ నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Posted Under AP
Editor