ముదిగుబ్బ: మండలంలోని చెరువులు, కుంటలకు హంద్రీనీవా కాల్వ ద్వారా సాగునీరు అందించాలని కోరుతూ సీపీఐ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు ఆధ్వర్యంలో నాయకులు సోమవారం తహసీల్దార్ ఉమామహేశ్వరరెడ్డికి వినతిపత్రం అందజేశారు.
మండలంలో వర్షాభావంతో చెరువులు, కుంటలు ఎండిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ముదిగుబ్బ చెరువుతో పాటు హంద్రీనీవా పరిధిలోని చెరువులకు నీరు అందించేలా వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
కార్యక్రమంలో డాబా రామకృష్ణ, తిప్పయ్య, తుమ్మల చిన్నప్ప, పాలు వెంకటేష్, తిరుపాలు, చాంప్లా నాయక్ తదితరులు పాల్గొన్నారు.
