కర్ణాటక స్టేట్ ఐజీయూ అధ్యక్షురాలు జానకీమోహన్కు ఘన సన్మానం.
అక్షర న్యూస్:ఆలూరు: కర్ణాటక స్టేట్ ఐజీయూ జర్నలిస్టు యూనియన్ అధ్యక్షురాలు జానకీమోహన్ ఆదివారం ఆలూరుకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆలూరు ఏపీయూడబ్ల్యూజే నాయకులు ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు.
జానకీమోహన్ ను శాలువా కప్పి, పూలమాలలు వేసి ఆలూరు జర్నలిస్టులు సత్కరించారు. గత 30 సంవత్సరాలుగా జర్నలిజం రంగంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ, తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించి, కర్ణాటక స్టేట్ ఐజీయూ జర్నలిస్టు యూనియన్ అధ్యక్షురాలిగా ఎదగడం అభినందనీయమని జర్నలిస్టులు పేర్కొన్నారు.
ముఖ్యంగా కర్నూలు జిల్లా ఆస్పరి మండలానికి చెందిన జానకీమోహన్ మారుమూల ప్రాంతంలో జన్మించి, పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో రాష్ట్ర జర్నలిస్టు యూనియన్ అధ్యక్షురాలిగా ఎదగడం కర్నూలు జిల్లా ప్రజలకు, జర్నలిస్టు వర్గాలకు గర్వకారణమని అన్నారు.
ఈ కార్యక్రమంలో జానకీమోహన్ భర్త, కర్ణాటక స్టేట్ ఐజీయూ సెక్రటరీ కృష్ణమోహన్ కూడా పాల్గొన్నారు. అనంతరం ఆలూరుకు చెందిన పలువురు జర్నలిస్టులు జానకీమోహన్ గారిని అభినందించి, ఆమె జర్నలిజం రంగంలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ సన్మాన కార్యక్రమంలో జర్నలిస్టులు ఓ.బి. రంగస్వామి, గుత్తి నాగరాజు, అటికెలగుండు బోయ గోపాల్, చిన్న సోమన్న, బోయ వీరేష్, హనుమేష్ తదితరులు పాల్గొన్నారు.
కర్ణాటక స్టేట్ ఐజీయూ అధ్యక్షురాలు జానకీమోహన్కు ఘన సన్మానం…
