గుండెపోటుతో కోళ్ల శ్రీరాములు మృతి

  • కుటుంబ సభ్యులను పరామర్శించిన టీడీపీ నాయకుడు బండి మల్లికార్జున

ముదిగుబ్బ మండలం ఎనుములవారిపల్లి (మలక వేముల క్రాస్) గ్రామానికి చెందిన జానగాని శ్రీరాములు (కోళ్ల శ్రీరాములు) గుండెపోటుతో సోమవారం రాత్రి మృతి చెందారు. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో గుండెపోటు రావడంతో ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

విషయం తెలుసుకున్న మలక వేముల టీడీపీ నాయకుడు బండి మల్లికార్జున శ్రీరాములు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ఈ విషాద సమయంలో శ్రీరాములు కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించాలని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థించారు.

Posted Under AP
Editor