స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో ప్రత్యేక సైబర్ అవేర్‌నెస్ కార్యక్రమం నిర్వహించారు. ‘Stay Alert – Stay Aware – Stay Safe & Secure’ అనే నినాదంతో జరిగిన ఈ కార్యక్రమానికి హీరో కింగ్ నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
రాష్ట్రవ్యాప్తంగా స్పార్క్ క్లబ్‌లకు చెందిన విద్యార్థుల ప్రతినిధులతో పాటు రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచడం, బాధ్యతాయుతమైన డిజిటల్ పౌరసత్వంపై చైతన్యం కల్పించడం, ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండేలా ప్రజలను ప్రోత్సహించడం కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా అధికారులు తెలిపారు.
పెరుగుతున్న సైబర్ మోసాల నేపథ్యంలో వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు, పాస్‌వర్డ్‌లు, ఓటీపీ వంటి సున్నితమైన సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని అధికారులు సూచించారు. అనుమానాస్పద లింకులు, కాల్స్, మెసేజ్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, డిజిటల్ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
