జాతీయ సమైక్యత ప్రతిబింబించేలా బైక్ ర్యాలీ జాతి కుల మతాలకతీతం మన భారతదేశం

ముదిగుబ్బ,80 వ స్వాతంత్ర వారోత్సవాల్లో భాగంగా ముదిగుబ్బ మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ముదిగుబ్బ మండలం తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ తుమ్మల మనోహర్ నాయుడు పాల్గొని మాట్లాడుతూ, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి అస్సాం నుంచి గుజరాత్ వరకు విస్తరించి ఉన్న భరతజాతి 80 సంవత్సరాల క్రితం దాస్యపు శృంఖలాలను తెంచుకొని స్వతంత్ర భారతావనిగా అవతరించిన మహా ఘట్టమని పేర్కొన్నారు. ఎందరో అమరవీరుల ప్రాణ త్యాగాలు రక్త ధారలతో సాధించుకున్న భారత జాతిని సుస్థిర సుసంపన్న దేశంగా అభివృద్ధి పథంలో నడిపించడం ప్రతి ఒక్క భారతీయుని ప్రథమ కర్తవ్యం అని తెలిపారు. ముదిగుబ్బ మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ కూడలి నుంచి పురవీధుల్లో పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున భారతమాతను కీర్తిస్తూ, జాతీయ జెండాను గౌరవిస్తూ దేశభక్తి నినాదాలు చేశారు. ముఖ్యంగా యువత దేశభక్తి భావంతో ముందుకు సాగుతూ, దేశ ప్రగతిలో చురుకైన భాగస్వాములు కావాలని తుమ్మల మనోహర్ ఆకాంక్షించారు. బైక్ ర్యాలీ లో సీనియర్ నాయకులు,పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Posted Under AP
Editor