ముదిగుబ్బ yes9TV
స్వాతంత్ర్య కాంక్షతో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా భారతదేశ దాస్య శృంఖలాలను పెకలించి అమరులైన వీరులకు ముదిగుబ్బ మండల భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు కొవ్వొత్తులు వెలిగించి ఘన నివాళి అర్పించారు. ముదిగుబ్బ మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ సర్కిల్ లో భారతీయ జనతా పార్టీ సత్యసాయి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు సోమల ప్రకాష్ నాయుడు ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు నాయకులతో కలిసి అమరవీరుల కోసం కొవ్వొత్తులు కాగడాల తో ఘన నివాళి అర్పించి వారి త్యాగాలను స్మరించారు. స్వా తంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన వీరులను స్మరించడం వారి వీర గాధలను తెలుసుకోవడం ప్రతి ఒక్క భారతీయుని ప్రథమ కర్తవ్యం అని సోమల ప్రకాష్ నాయుడు పేర్కొన్నారు.
స్వాతంత్ర్య అమరవీరులకు కొవ్వొత్తులు వెలిగించి ఘన నివాళి… బిజెపి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు సోమల ప్రకాష్ నాయుడు మరియు బిజెపి నాయకులు
