దొంగల బీభత్సం..ఇంట్లోని బంగారం, వెండి, నగదు అపహరణ..

అనంతపురం జిల్లా రాయదుర్గం

దొంగల బీభత్సం..ఇంట్లోని బంగారం, వెండి, నగదు అపహరణ

రాయదుర్గం పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో ఆదివారం రాత్రి భారీ చోరీ జరిగింది.
బాధితుడు షేక్ రహంతుల్లా తెలిపిన వివరాల ప్రకారం, తాను ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తున్నానని, తన భార్య ఆరోగ్యం బాగాలేక ఇద్దరూ బంధువుల ఇంటికి వెళ్లినట్లు చెప్పారు. ఈ విషయాన్ని గమనించిన దొంగలు ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని ఆసరాగా చేసుకుని తాళం పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు.
అనంతరం ఇంట్లోని బీరువాను తెరిచి అందులో ఉన్న సుమారు 4 తులాల బంగారం, 15 తులాల వెండి, అలాగే రూ.1,80,000 నగదు అపహరించినట్లు బాధితుడు తెలిపారు.
సోమవారం ఇంటికి తిరిగి వచ్చిన అనంతరం చోరీ జరిగిన విషయం గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి, చోరీకి పాల్పడిన దుండగులను త్వరగా గుర్తించి అరెస్టు చేయాలని బాధితుడు పోలీసులను కోరారు.

Posted Under AP
Editor