అనంతపురం జిల్లా గుత్తి
*గుత్తి కోటపై “యోగాంధ్ర” కార్యక్రమం..*
– *: కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేసిన జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్, రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు ఛైర్మన్ వెంకటశివుడు యాదవ్, జిల్లా టూరిజం అధికారి ఓబులమ్మ, తదితరులు..*
అనంతపురం, జూన్ 20 :
– *యోగాంధ్ర – 2026 కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని కోటపైన గుర్రపుశాల వద్ద “యోగాంధ్ర” కార్యక్రమం నిర్వహించగా, ఇందులో జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్, రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు ఛైర్మన్ వెంకటశివుడు యాదవ్, జిల్లా టూరిజం అధికారి ఓబులమ్మ, యోగాంధ్ర జిల్లా ఆయుష్ నోడల్ అధికారి డాక్టర్ లాల్య నాయక్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్, రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు ఛైర్మన్, తదితరులు యోగాసనాలు వేశారు.*
– *ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా పర్యాటక స్థలమైన గుత్తి కోటపై “యోగాంధ్ర” కార్యక్రమం నిర్వహించామన్నారు. ప్రతి ఒక్కరూ యోగా చేయాలని, యోగా మీద అందరికీ అవగాహన ఉండాలన్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా జిల్లాలోని పర్యాటక ప్రాంతాలపై అవగాహన వచ్చేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఇంతకుముందు దివ్యాంగ యోగా, తాడిపత్రి పట్టణంలోని శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద యోగా చేయడం జరిగిందని, ఈరోజు గుత్తి కోటలో యోగా చేయడం ద్వారా ఈ పర్యాటక ప్రాంతాల గురించి అందరికీ తెలిసే అవకాశం ఉంటుందన్నారు.*
– *ఈ సందర్భంగా జిల్లా టూరిజం అధికారి ఓబులమ్మ మాట్లాడుతూ గుత్తి పట్టణంలోని కోటపైన గుర్రపుశాల వద్ద పర్యాటక శాఖ ఆధ్వర్యంలో “యోగాంధ్ర” కార్యక్రమం కింద యోగా చేయడం జరిగిందని, ఇందుకు సహకరించి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో 50 పర్యాటక ప్రాంతాల్లో యోగా కార్యక్రమం చేస్తున్నామని, గుత్తి కోటపైన ఈ కార్యక్రమం చేయడం ద్వారా పర్యటకంగా గుర్తింపు వస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా యోగా డే సంకల్పాన్ని యోగా మాస్టర్ అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం జాయింట్ కలెక్టర్, రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు ఛైర్మన్ లకు మున్సిపల్ కమిషనర్ శాలువా కప్పి మెమెంటో అందించి చిరుసత్కారం చేశారు.*
– *ఈ కార్యక్రమంలో గుంతకల్లు ఆర్డీఓ ఆర్బిఎస్కె శ్రీనివాస్, మెప్మా పిడి విశ్వజ్యోతి, మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియ, గుత్తి తహసీల్దార్ పుణ్యవతి, ఆయుష్ వైద్యాధికారి డా.తిరుపతి నాయుడు, యోగా మాస్టర్లు తిప్పయ్య, నాగమణి, కళావతి, కృష్ణయ్య, రామకృష్ణ, ఎంఈఓ, ఎంపిడిఓ, గుత్తి కోట పరిరక్షణ సమితి వ్యవస్థాపకుడు విజయభాస్కర్, మెప్మా టెక్నికల్ ఎక్స్పర్ట్ భవాని, ఆయా శాఖల అధికారులు, అనధికారులు, విద్యార్థులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.*
