Latest Posts

తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్.. కళ్యాణదుర్గంలో దొంగల బీభత్సం…

అనంతపురం జిల్లా
(స్ట్రింగర్ : కళ్యాణదుర్గం)

తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్.. కళ్యాణదుర్గంలో దొంగల బీభత్సం.

తాళాలు వేసిన ఇళ్లనే టార్గెట్ చేస్తున్న దుండగులు.. పోలీసులకే సవాల్.

కళ్యాణదుర్గం జయనగర్ కాలనీలో ఒకే రాత్రిలో రెండు ఇళ్లలో చోరీలు. వరుస చోరీలతో భయాందోళనలో పట్టణ ప్రజలు.

హీరో షోరూమ్ నిర్వాహకుడు ప్రభంద్ ఇంట్లో 10 తులాల బంగారం, రూ.25 వేల నగదు అపహరణ.

బీరువాలు ధ్వంసం చేసి లాకర్లను సైతం ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించి బంగపడ్డ దొంగలు.

అదే ప్రాంతంలోని మరో ఇంటిలోనూ చోరీ.. భారీగా నగదు, బంగారం మాయం అయినట్లు సమాచారం.

ఘటనా స్థలాలను పరిశీలించిన సీఐ హరనాథ్, క్లూస్ టీం.. ఆధారాల సేకరణ.

ఇటీవల పాత బస్టాండ్ ప్రాంతంలో నాలుగు దుకాణాల్లో చోరీలు.. తాజాగా ఇళ్లలోనూ వరుస ఘటనలు.

రాత్రి గస్తీ పెంచాలని, సీసీ కెమెరాల నిఘా మరింత బలోపేతం చేయాలని స్థానికుల డిమాండ్.

Posted Under AP
Editor