అనంతపురం జిల్లా, కలెక్టరేట్.
జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత విద్య అమలు చేయాలి కలెక్టర్కు ఏపీయూడబ్ల్యూజే వినతి
అనంతపురం జిల్లా జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కొన్నేళ్లుగా అనంతపురం ఉమ్మడి జిల్లాలో జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలలో అమలు అవుతున్న ఉచిత విద్య ను ఈ సంవత్సరం అమలు చేయండని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శి లు పయ్యవుల ప్రవీణ్, మహమ్మద్ ఆయుఫ్ ఆధ్వర్యంలో ఇవాళ కలెక్టర్ ఓ ఆనంద్ కు యూనియన్ నాయకులు వినతి పత్రం అందజేశారు.
విద్యా హక్కు చట్టం ప్రకారం 25% సీట్లు పేద పిల్లలకు ఉచితంగా ఇవ్వాలన్న నిబంధన అమలు లో భాగంగా జర్నలిస్టుల పిల్లలకు అది వర్తింపజేయాలని కోరారు. ప్రతి సంవత్సరం కలెక్టర్ ఆదేశాలతో విద్యాశాఖ ఈ విషయం పై మెమో ఇస్తుందని తెలిపారు. మెమోను అధికారుల ద్వారా ప్రైవేట్ పాఠశాలలకు పంపాలని కోరారు. గత సంవత్సరం కలెక్టర్ గా ఉన్న వినోద్ కుమార్ విద్యా సంస్థల్లో రాయితీ కల్పిస్తూ మెమో ఇచ్చారు.
గ్రామీణ ప్రాంతాలలో పనిచేసే రిపోర్టర్లతో పాటు స్ట్రింగర్లుగా, కాంట్రిబ్యూటర్లుగా పనిచేస్తున్న వారికి ఒకటి, రెండు సంస్థల లో నామమాత్రపు గౌరవ వేతనం వస్తుంది. చాలా సంస్థలలో అది అందరి పరిస్థితి నెలకొంది. అనంతపురం జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితుల నేపథ్యంలో పిల్లల పాఠశాలల ఫీజులు చెల్లించే స్థితిలో జర్నలిస్టులు లేరు. ఈ జిల్లాలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో జర్నలిస్టుల పిల్లల కు ఫీజుల్లో రాయితీ అమలయ్యేలా పెద్ద మనసుతో విద్యాశాఖ ను ఆదేశించగలని డిమాండ్ చేశారు వెంటనే అందుకు సంబంధించిన మెమో ఇచ్చి జర్నలిస్టుల పిల్లలకు ఈ ఏడాది పాఠశాలలు ప్రారంభం అయ్యే లోగా అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు మహమ్మద్ ఆయుఫ్, మహమ్మద్ రసూల్, ఆర్ వీ ఎస్ ప్రసాద్, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా నాయకులు నాగేంద్ర నాథ్ రెడ్డి, యూనియన్ స్టేట్ కౌనిల్ సభ్యులు బాల రంగారెడ్డి, కేపీ కుమార్, చిన్న పత్రికల నాయకులు చౌదప్ప, చలపతి, సనప రామకృష్ణ, లోకరాజు తదితరులు పాల్గొన్నారు.
