Latest Posts

“ముదిగుబ్బ పిహెచ్సిలో ఆశాడే కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా వైద్యాధికారిణి డా. ఫైరోజా బేగం”

ముదిగుబ్బ yes9 TV
ముదిగుబ్బ, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి శ్రీమతి డా. ఫైరోజా బేగం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ముదిగుబ్బ నందు నిర్వహించిన ఆశాడే కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రవేశపెట్టిన పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ కార్యక్రమంపై రోగులకు అవగాహన కల్పిస్తూ 80 శాతం లక్ష్యాన్ని సాధించే విధంగా కృషి చేయాలని సిబ్బందికి సూచించారు.
అనంతరం ఓపీ సేవలు, గర్భిణీలకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. తదుపరి వార్డులు, ప్రయోగశాల (ల్యాబ్), మందుల నిల్వలను పరిశీలించి సంబంధిత రిజిస్టర్లను తనిఖీ చేశారు. పిహెచ్సి పరిసరాలను పరిశీలించి పరిశుభ్రతను పాటించాలని ఆదేశించారు. అకాల వర్షాలు ప్రారంభమైన నేపథ్యంలో డెంగ్యూ, మలేరియా, ఫైలేరియా వంటి ప్రాణాంతక వ్యాధుల నివారణకు ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ప్రతి శుక్రవారం తప్పనిసరిగా “ఫ్రైడే – డ్రై డే” కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు.అలాగే హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరో మూడు నెలలు పొడిగించినట్లు తెలిపారు. 0 నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలకు ఈ నెల 28, 29, 30 తేదీలలో జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలియజేశారు.రాబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలందరూ విరివిగా పాల్గొని యోగాను తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు…

Posted Under AP
Editor