Latest Posts

డీజీపీకి చేరిన ఈటల పోస్టర్ల పంచాయితీ..!

బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పై పోస్టర్లకు, గ్రూప్ తగాదాలకు సంబంధం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తెలిపారు. ఢిల్లీలో పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ.. బీజేపీలో అంతర్గత కలహాలు పెట్టాలని ఈటల పై పోస్టర్లు పెట్టారని పేర్కొన్నారు. పోస్టర్లు పెట్టిన వారిపై పార్టీ పరంగా చర్యలు తీసుకుంటామన్నారు.

 

జాతీయ నాయకత్వం ఫోకస్..

ఈ అంశంపై ఇప్పటికే డీజీపీ, కమిషనర్ కు ఫిర్యాదు చేశామన్నారు. తెలంగాణ, కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే దిశగా బీజేపీ జాతీయ నాయకత్వం కార్యాచరణ రూపొందిస్తోందన్నారు. తెలంగాణపై బీజేపీ జాతీయ నాయకత్వం ఫోకస్ చేసిందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వడ్ల కొనుగోలు జరగడం లేదని, రాష్ట్రంలో ఎంత పంట పడిందనే సమాచారం కేంద్రానికి ఇవ్వలేదని తెలిపారు. రైతుల వద్ద ఉన్న పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. చివరి ధాన్యం వరకు కొనుగోలు చేస్తామని చెప్పారని, మాట ఇచ్చిన ప్రకారం కొనుగోలు చేయాలన్నారు.

 

ఢిల్లీలో బీజేపీ ఆధ్వర్యంలో..

ప్రభుత్వం నిద్రపోతోంది కాబట్టే.. కొనుగోలు సమస్యలు వచ్చాయని ఫైరయ్యారు. ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ గ్రామాల బాట పట్టడంతో రాష్ట్ర ప్రభుత్వం లారీలు పంపుతోందని రాంచందర్ రావు తెలిపారు. ఇదిలా ఉండగా మంగళవారం ఢిల్లీలో బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ వేడుకలకు పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సహా, బీజకేపీ జాతీయ నాయకులు పాల్గొంటారని స్పష్టంచేశారు.

Editor