తాడిమర్రి( yes9tv )మన ఊరు – మన జెండా కార్యక్రమంలో ఘనంగా బీజేపీ 75వ ఆవిర్భావ వేడుకలు
శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం మరువపల్లి గ్రామంలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు “మన ఊరు – మన జెండా” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు, జిల్లా బీజేపీ అధ్యక్షుడు జీ.ఎం. శేఖర్ గారి సూచనల మేరకు ఈ కార్యక్రమం ఈ రోజు సాయంత్రం 5:30 గంటలకు నిర్వహించబడింది.
భారతీయ జనతా పార్టీ 75వ ఆవిర్భావ వేడుకల సందర్భంగా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఎన్‌డీఏ ప్రభుత్వ సుపరిపాలనను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తాడిమర్రి మండల బీజేపీ అధ్యక్షులు దేవర రామమోహన్, జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు చింతల ఒన్నురెడ్డి, శంకరెడ్డి, భాస్కరనాయుడు, చంద్రబాబు నాయుడు, ఆదినారాయణ, రవీంద్రనాయుడు, శేఖరెడ్డి, గంగరాజు, కుళ్లాయప్ప, రంగయ్య తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో గ్రామ ప్రజలు, బీజేపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.
తాడిమర్రిలో “మన ఊరు – మన జెండా” కార్యక్రమం: ఘనంగా బీజేపీ 75వ ఆవిర్భావ వేడుకలు
