అనంతపురం జిల్లా, రాయదుర్గం.
ఆర్యవైశ్యుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడిన పంచ్ ప్రభాకర్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు
అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఆర్యవైశ్య కులస్తులను అవమానకరంగా, అసభ్య పదజాలంతో కించపరిచినట్లు ఆరోపిస్తూ పంచ్ ప్రభాకర్‌పై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ రాయదుర్గం పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్కు ఆర్యవైశ్య సంఘం నాయకులు మరియు అనుబంధ సంఘాల ప్రతినిధులు ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తాయి రాజశేఖర్ మాట్లాడుతూ, సమాజంలోని ఒక వర్గాన్ని అవమానించేలా మాట్లాడటం తీవ్రంగా ఖండించాల్సిన విషయమని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు సామాజిక విభేదాలకు దారితీసే అవకాశం ఉందని పేర్కొన్నారు. పంచ్ ప్రభాకర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరామని తెలిపారు.
