అనంతపురం జిల్లా, రాయదుర్గం.
ఎన్టీఆర్ ట్రోఫీ కేసీఎల్-3 క్రికెట్ టోర్నమెంట్ ఘన ప్రారంభం
స్వర్గీయ డాక్టర్ నందమూరి తారకరామారావు జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏడాది నిర్వహించే ఎన్టీఆర్ ట్రోఫీ కేసీఎల్ క్రికెట్ టోర్నమెంట్‌ను ఈ ఏడాది కూడా కాలవ ఫౌండేషన్ చైర్మన్ కాలవ భరత్ ఘనంగా ప్రారంభించారు.
గురువారం రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా కేసీఎల్-3 సీజన్‌కు శ్రీకారం చుట్టారు.
రాయదుర్గం పట్టణంలో నిర్వహించిన ప్రారంభ కార్యక్రమంలో కాలవ భరత్ పాల్గొని క్రీడాకారులను పరిచయం చేసుకుని వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ యువత క్రీడల ద్వారా క్రమశిక్షణ, ఐక్యత, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని సూచించారు. స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా యువతను ప్రోత్సహించే కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని పేర్కొన్నారు.
నియోజకవర్గంలోని ఐదు మండలాలతో పాటు పట్టణంలో ప్రారంభమైన క్రికెట్ పోటీలకు యువత పెద్ద ఎత్తున హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎన్టీఆర్ పేరు మీద నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్ యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు సామాజిక ఐక్యతకు వేదికగా నిలుస్తోందని పలువురు అభిప్రాయపడ్డారు.
రాయదుర్గంలో జరిగిన ప్రారంభ మ్యాచ్‌లో వినయ్ రాయల్స్ జట్టు, భజరంగ్ దళ్ జట్టు మధ్య జరిగిన పోటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
