అనంతపురం జిల్లా, కలెక్టరేట్.
ఘనంగా డా. ఎన్టీఆర్ జయంతి వేడుకలు
అనంతపురం, మే 28: స్వర్గీయ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పద్మశ్రీ డా. నందమూరి తారక రామారావు సేవలు అజరామరమని జిల్లా ఇంచార్జి కలెక్టర్ సి. విష్ణు చరణ్ పేర్కొన్నారు. గురువారం అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలను జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జి కలెక్టర్ సి. విష్ణు చరణ్‌తో పాటు ఏపీ వీరశైవ లింగాయత్ వెల్ఫేర్ డెవలప్మెంట్ ఛైర్మన్ స్వప్న, అనంతపురం మార్కెట్ యార్డు ఛైర్‌పర్సన్ బల్లా పల్లవి, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కమలమ్మ, వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ అంకె ఈశ్వరయ్య, రజక కార్పొరేషన్ డైరెక్టర్ పరమేశ్వర్, లేబర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ నాగభూషణం, జిల్లా పర్యాటక శాఖ అధికారి ఓబులమ్మ, డీఆర్వో ఏ. మలోల, రచయిత ఏలూరి ఏంగన్న తదితరులు పాల్గొన్నారు.
ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఫోటో ప్రదర్శనను సందర్శించారు.
ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జి కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్టీఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసి చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు.
డీఆర్వో ఏ. మలోల మాట్లాడుతూ, తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలకు ఎన్టీఆర్ ప్రత్యేక గౌరవం తీసుకొచ్చారని, దేశవ్యాప్తంగా తెలుగు జాతికి గుర్తింపు కల్పించిన మహానేత అని అన్నారు.
ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు మాట్లాడుతూ ఎన్టీఆర్ బాల్యం, సినీ జీవితం, రాజకీయ ప్రస్థానం, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గుర్తు చేసుకున్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఎన్టీఆర్ సేవలను మరువలేమన్నారు. కార్యక్రమంలో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆనంద్, సివిల్ సప్లై డీఎం రమేష్ రెడ్డి, మెప్మా పీడీ విశ్వజ్యోతి, ఐ&పీఆర్ డీఐపీఆర్ఓ ఏ. బాలకొండయ్య, ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ గెజిటెడ్ ఆఫీసర్స్ జనరల్ సెక్రటరీ రవిశంకర్, కలెక్టరేట్ ఏవో అలెగ్జాండర్, సెక్షన్ సూపరింటెండెంట్ యుగేశ్వరిదేవి, తహసీల్దార్లు శేషారెడ్డి, రాజా, అరుణ తదితరులు పాల్గొన్నారు.
