- ఎమ్మెల్యే అమిలినేని ఆధ్వర్యంలో మహానాడు సన్నాహక సమావేశం
- మన ఇంటి పండుగలా పచ్చటి తోరణాలు కట్టి మహానాడు జరుపుకుందాం
- మహిళలు పసుపు రంగు చీరలు ధరించి మహానాడుకు తరలిరండి
- రాష్ట్రం కళ్యాణదుర్గం వైపు చూసేలా మహానాడు నిర్వహిద్దాం
- స్త్రీ శక్తి ప్రధాన తీమ్ గా మహానాడు నిర్వహణ
పసుపు సైనికుల పండుగ(మహానాడు)ను వర్చువల్ విధానంలో జరుపుకుంటున్న సందర్బంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని మహిళలతో క్లస్టర్ల పరిధిలో నిర్వహించేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై చర్చించేందుకు సమావేశాన్ని ప్రజావేదికలో నిర్వహించగ కళ్యాణదుర్గం మున్సిపాలిటీలోని మహిళలలతో సమావేశానికి పార్టీ పరిశీలకులు రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణ గారు ముఖ్యఅతిథిగా విచ్చేశారు.. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారు మాట్లాడుతూ దేశ ప్రధాని పిలుపుతో ఇందన పొదుపు చేయడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నిర్ణయంతో మహానాడను క్లస్టర్ వైస్ గా వర్చువల్ విధానంలో నిర్వహిస్తున్నారు.. పంచాయతీలకు కూడా రాబోయే రోజుల్లో అధికంగా నిధులు రాబోతున్నాయి..తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి కంచుకోటల నిలిపారని, రెండు రోజుల పాటు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ అందుబాటులో ఉంచుతామని, ప్రతి గ్రామంలోను మున్సిపాలిటీలో కూడా ఎన్టీఆర్ విగ్రహాలు, పార్టీ జెండా ఎగురవేసి, ప్రతి ఇంట్లో ఎన్టీఆర్ గారి చిత్రపటాలకు ఘనమైన నివాళి అర్పించాలని, మన దేశంలో అత్యంత ఎదుగుతున్న నాయకుడు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు కష్టపడే కార్యకర్తలను గుర్తించి నేడు క్లస్టర్ ఇంచార్జులకు ప్రాధాన్యత ఇచ్చి వారికి తగిన గౌరవం కల్పిస్తున్నారని తెలిపారు..నియోజకవర్గంలోని 11 క్లస్టర్ల పరిధిలో ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించే మహానాడు కార్యక్రమానికి ప్రతి గ్రామం, మున్సిపాలిటీల నుంచి పెద్ద ఎత్తున పసుపు సైనికులు, మహిళలు కూడా పసుపు దుస్తులు ధరించి పెద్ద ఎత్తున హాజరై దిగ్విజయం చేయాలని సూచించారు..
