అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం.
అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు, కళ్యాణదుర్గం డీఎస్పీ రవికుమార్ పర్యవేక్షణలో పోలీసులు క్రికెట్ బెట్టింగ్ కేసులో కీలక పురోగతి సాధించారు.
కళ్యాణదుర్గం పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రైమ్ నెం.82/2026 కేసులో పరారీలో ఉన్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో అనంతపురం రాంనగర్‌కు చెందిన బాబ్ జాన్ (38), పాపంపేటకు చెందిన ఖలీలుల్లా (35) ఉన్నారు.
కళ్యాణదుర్గం పట్టణ సీఐ హరినాథ్ నేతృత్వంలో ప్రత్యేక బృందం కళ్యాణదుర్గం శివారులోని టమోటా మార్కెట్ సమీపంలో నిందితులను అదుపులోకి తీసుకుంది. వారి వద్ద నుంచి రూ.2 లక్షల నగదు, ఒక కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
క్రికెట్ బెట్టింగ్ నిర్వహణ, ఐటీ చట్టం, ఏపీ గేమింగ్ యాక్ట్ కింద నమోదైన ఈ కేసులో నిందితులను కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్ విధించింది
