*అనంతపురం.*జిల్లా రాయదుర్గం*
*రాయదుర్గం విద్య ఆణిముత్యాలకు ప్రతిభా పురస్కారాలను పంపిణీ*
*: కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ మరియు రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్, తదితరులు..*
*రాయదుర్గం పట్టణంలోని జయంతి రాధాకృష్ణ కల్యాణ మండపంలో శుక్రవారం రాయదుర్గం విద్య ఆణిముత్యాలకు ప్రతిభా పురస్కారాలను పంపిణీ చేసే కార్యక్రమం నిర్వహించగా, ఇందులో ప్రభుత్వ విప్ మరియు రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విప్, జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గతేడాదికన్నా పదవ తరగతిలో ఏడు శాతం అధికంగా ఉత్తీర్ణత కావడం జరిగిందని, గతేడాది 70 శాతం ఉంటే ఈ ఏడాది 77 శాతం ఉత్తీర్ణత అయ్యారని, వచ్చే ఏడాది ఉత్తీర్ణత శాతం మరింత పెంచాలన్నారు. మంచి మార్కులు సాధించిన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల సదుపాయాలను కల్పించడం జరుగుతోందన్నారు. కొన్ని ప్రైవేట్ పాఠశాలలకన్నా ప్రభుత్వ పాఠశాలల్లో ఫలితాలు మంచిగా ఉన్నాయని, ఈ విషయం అందరికీ తెలియజేయాలన్నారు. ప్రతి పిల్లవాడు ప్రభుత్వ పాఠశాలలో చేరేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.*
