శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ఆదేశాల మేరకు అన్ని శాఖలకు సంబంధించి ప్రజా దర్బార్ నిర్వహించడం జరిగింది ఒక నెల ఒక గ్రామము నాలుగు పర్యటనలు రాష్ట్రాన్ని భూ తగాదాలు లేని ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయమని, ప్రజల సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి పల్లె సింధూర రెడ్డి పేర్కొన్నారు.
పుట్టపర్తి నియోజకవర్గంలోని నల్లమాడలో శుక్రవారం ఎంపీడీవో కార్యాలయం ఆవరణంలో పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీమతి పల్లె సింధూర రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది
ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన మొత్తం 139 అర్జీలను ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి స్వీకరించారు. వాటిని సంబంధిత అధికారులకు ఇచ్చి వాటికి తక్షణం పరిష్కారం చూపాలని ఆదేశించారు.
ఇందులో వివిధ సాంకేతిక కారణాలతో 34 మంది రెవెన్యూ సమస్యలు ,5 రస్తా వివాదాలపైన , మరో 3 నూతన బోర్లు ఏర్పాటు చేసి త్రాగునీరు ఇవ్వాలని ,మరో 5 మంది కొత్త పెన్షన్ కావాలని, 52 రైతులు కొత్తగా అసైన్ కమిటీ ద్వారా పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయాలని మరో 45 మంది భూ సమస్యలపై అర్జీలు సమర్పించారు.
ప్రతి అర్జీని పారదర్శకంగా పరిశీలించి అర్హులైన వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు ప్రభుత్వ శాఖల అధికారులు తహసిల్దార్లు ఎంపీడీవోలు ఈఓఆర్డిఓలు ,డ్వామా, డి ఆర్ డి ఏ వెలుగు , విద్యుత్ వ్యవసాయ శాఖ,ఇతర శాఖల అధికారులు,స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
