కర్నూలు జిల్లా హోళగొంద మండలం సులువాయి లో దారుణం దారుణం జరిగింది. ఆస్తికోసం తన పిన్ని తల్లిని వేటి కొడవలితో దాడి చేసిన ఘటన గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. వివరాల్లోకి వెళితే శేకన్న అనే వ్యక్తి తండ్రి గాదిలింగకు ఇద్దరు భార్యలు
అందులో చిన్న భార్య అయిన ఎల్లమ్మ కు రెండు ఎకరాలు భూమి ని ఇచ్చాడు. పెద్ద భార్య కుమారుడైన శేకన్న రాత్రి తాగిన మత్తులో తన పిన్ని తల్లి అయిన ఎల్లమ్మను నీ పేరు మీద ఉన్న పొలము ఆస్తిని నా పేరు మీద రాసి ఇవ్వాలని ఘర్షణకు దిగాడు. అందుకు ఎల్లమ్మ నాకు కూడా ముగ్గురు కూతుర్లు ఉన్నారు నీకెందుకు రాసిస్తానని నిరాకరించింది.
అందుకు శేకన్న కోపోద్రుక్తుడై ఆవేశంతో వేట కొడవలి తో పిన్ని తల్లి ఎల్లమ్మను (వయస్సు 45 ) విచిక్షణ రహితంగా నరికి చంపి పరారయ్యాడు. పోలీసులకు సమాచారం అందడంతో సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలో జరగకుండా పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు.
ఆస్తి కోసం పిన్నిని వేటకొడవలితో నరికి చంపిన సవతి కొడుకు…
