రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక పీజీఆర్ఎస్..

అనంతపురం జిల్లా,రాయదుర్గం.

రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక పీజీఆర్ఎస్

రాయదుర్గంలో జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ ప్రారంభం

అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం ఊడేగోళం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు సందర్శనలు” కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు.
స్థానిక ఆర్డీటీ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రత్యేక పీజీఆర్ఎస్ వ్యవస్థను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. భూ సమస్యలు లేని జిల్లాగా అనంతపురాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ రైతుల భూ సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరమని అన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్, కళ్యాణదుర్గం ఆర్డీవో వసంత బాబు, డీఎస్పీ రవిబాబు, తహసీల్దార్ హరికుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor