Latest Posts

మరువపల్లిలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం….

తాడిమర్రి yes9tv మరువపల్లిలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం.. కొత్త బోరు ఏర్పాటు
తాడిమర్రి మండలం, యం.అగ్రహారం గ్రామ పంచాయతీ పరిధిలోని మరువపల్లి గ్రామంలో వన్నూరుస్వామి సమీప ప్రాంత నివాసులు తీవ్ర నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మండల పరిషత్ నిధులతో కమ్యూనిటీ హాల్ సమీపంలో కొత్త బోరును ఏర్పాటు చేశారు. బోరులో సమృద్ధిగా నీరు లభించడంతో గ్రామ ప్రజల్లో ఆనందం వ్యక్తమైంది.
ఈ బోరు నీటిని పైప్‌లైన్ ద్వారా గ్రామంలోని ప్రతి ఇంటికి సరఫరా చేయనున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించినట్లైంది.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ప్రభుత్వానికి, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గౌరవ ఎంపీడీఓ రంగారావు, పంచాయతీరాజ్ డిప్యూటీ ఎంపీడీఓ విజయశేఖర్ నాయుడు, పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ మెషియ, పంచాయతీ కార్యదర్శి నారాయణస్వామి, గ్రామ పెద్దలు వన్నూరురెడ్డి, శంకరరెడ్డి, జయనాగిరెడ్డి తదితరులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor