నల్లమాడ మండలం పులగంపల్లి వద్ద ఘోర ప్రమాదం: గుర్తుతెలియని వాహనం ఢీకొని వృద్ధుడు మృతి

శ్రీ సత్య సాయి జిల్లా నల్లమాడ మండలం మండల పరిధిలోని పులగంపల్లి దగ్గర గుర్తుతెలియని వాహనం ఢీ కొనడం వలన గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. నల్లమాడ పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఆదివారం రాత్రి కదిరి నుండి హిందూపురం వెళ్లే జాతీయ రహదారిపై పులగంపల్లి దగ్గర గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తుతెలియని వృద్ధుడు (60) మృతి చెందాడు అని తెలిపారు మృతుడు తెల్లని చొక్కా నీలం రంగు పంచ ధరించినాడు. పులగంపల్లి విఆర్ఓ ఫిర్యాదు మేరకు కదిరి ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించినట్టు పోలీసులు తెలిపారు

Posted Under AP
Editor