శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమం అనంతరం ప్రజావేదిక సమీపంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు తిలకించించారు. ఐటీడీ ఏల ఆధ్వర్యంలో సవర ఆర్ట్ గ్యాలరీ వద్ద గిరిజనులు ప్రత్యేకంగా తయారు చేసిన ఓవర్ కోటును ముఖ్యమంత్రి కొనుగోలు చేసి ధరించారు. సముద్ర తీరప్రాంతాల్లో పెంచే సీవీడ్ సాగుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మత్స్యకారులకు మరింత ఆదాయం వచ్చేలా చూడాలన్నారు. అనంతరం శ్రీకాకుళం జిల్లాలో పోలీసులు ఏర్పాటు చేసిన వినూత్న కార్యక్రమం హెల్మెట్ బ్యాంక్‌ను చూసి సీఎం అభినందించారు. హెల్మెట్ ధరించి బుల్లెట్ వాహనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధిరోహించారు.
శ్రీకాకుళంలో సీఎం చంద్రబాబు పర్యటన: గిరిజన కోటు ధరించి, బుల్లెట్ నడిపిన ముఖ్యమంత్రి
