Latest Posts

పెట్రో ధరల పెంపుపై నిరసన…

ముదిగుబ్బ,యస్ 9
ముదిగుబ్బ మండలం లో పెట్రోధరల పెంపును నిరసిస్తూ సీఐటీయూ, సిపిఎం నాయకులు స్థానిక కరెంట్ ఆఫిస్ నుంచి బస్టాండ్ వరకు ఆటోకు తాడు కట్టి తాడుతో ఆటోను లాగుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పెట్రోలు, డీజిల్ ధరలు పెంచి పేదలపై భారం మోపారన్నారు. ఆటో, మినీ ఆటో, క్లబ్ గూడ్స్ వాహనాలను లక్షల మంది కార్మికులు నడుపుకుంటూ తమ కుటుంబాలను
పోషించుకుంటున్నారన్నారు. వీరందరికీ ఉపాధి దెబ్బతినే విధంగా అదేవిధంగా ప్రజల పైన భారం మోపే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోలు డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో
సిపిఎం మండల కార్యదర్శి ఆటో పెద్దన్న, సీఐటీయూ మండల కార్యదర్శి బాబ్జాన్ పక్కిరప్ప, ముస్తపా,తదితరులు పాల్గొన్నారు..

Posted Under AP
Editor