Latest Posts

శ్రీ చైతన్య విద్యాసంస్థలకు కొమ్ముకాస్తున్న డిప్యూటీ డీఈఓ సీసీ: అనంతపురంలో AISF ధర్నా

శ్రీ చైతన్య విద్యాసంస్థలకు వత్తాసుగా పనిచేస్తున్న డిప్యూటీ డిఈఓ సిసి మంజీరా గారిని సస్పెండ్ చేయాలి

డీఈఓ ఆదేశాలు ఇస్తే అవి పాటించకుండా ఆ ఆదేశాలను చైతన్య విద్యాసంస్థలకు తెలియజేయడమా??

డీఈఓ ఆదేశాలను తుంగలో తొక్కుతూ చైతన్య విద్యాసంస్థలకు పార్ట్నర్ గా పనిచేస్తున్న డిప్యూటీ డిఈఓ సిసి ను విధుల నుండి తొలగించాలి

విద్యాశాఖలో జిల్లాలో ఏం జరగాలన్నా మంజీరా గారే

డిప్యూటీ డిఈఓ సిసి గారి పైన ఎంక్వైరీ కమిటీ వేయాలి

ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ కార్యాలయం దగ్గర ధర్నా

ఏఐఎస్ఎఫ్ అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి కుళ్లాయి స్వామి

అనంతపురం అర్బన్:: శ్రీ చైతన్య విద్యా సంస్థలకు వత్తాసుగా పనిచేస్తున్న డిప్యూటీ డిఈఓ సిసి మంజీరా గారిని సస్పెండ్ చేయాలని జిల్లా విద్యాశాఖ కార్యాలయం దగ్గర ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి కుల్లాయి స్వామి మాట్లాడుతూ ఒక ప్రభుత్వ జిల్లా విద్యాశాఖ అధికారి సీసీగా పని చేస్తున్న మంజీరా గారు ప్రభుత్వ ఆధీనంలో నడవకుండా శ్రీ చైతన్య విద్యా సంస్థలు మరియు అనంతపురం నగరంలో ఉన్న కార్పొరేట్ విద్యాసంస్థల ఆధీనంలో పనిచేస్తున్నారని మండిపడ్డారు జిల్లా విద్యాశాఖ అధికారి డీఈవో ప్రసాద్ బాబు గారు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకుండా ఆదేశాలను శ్రీ చైతన్య విద్యాసంస్థల యాజమాన్యులకు ఫోన్ ద్వారా తెలియజేస్తూ సార్ గారు ఇలా తెలిపారు జాగ్రత్త పడండి అంటూ వాళ్లకు ఇన్ఫార్మర్ గా మారారని పేర్కొన్నారు. జిల్లా విద్యాశాఖ ఆదేశాలను తుంగలో తొక్కుతూ శ్రీ చైతన్య విద్యా సమస్యలకు వత్తాసుగా పనిచేస్తున్న డిప్యూటీ డిఈఓ సిసి గారిని తక్షణమే సస్పెండ్ చేయాలి లేకుంటే బదిలీ చేయాలని పేర్కొన్నారు. జిల్లా విద్యాశాఖలో కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యులు ఏమైనా పని జరగాలంటే డీఈవో కానీ డిప్యూటీవో దగ్గరికి రావలసిన అవసరం లేదు డిప్యూటీ డిఈఓ సిసి దగ్గరికి వెళ్తే పని జరిగిపోతుంది అన్న రీతిలో ప్రచారం జరుగుతుందన్నారు. ప్రభుత్వ విద్యాశాఖ కార్యాలయంలో పనిచేస్తూ ప్రభుత్వ ఆధీనంలో పనిచేయకుండా కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యులకు వత్తాసుగా పనిచేయడం ఎంతవరకు కరెక్ట్ అని మండిపడ్డారు. ఒక విద్యాశాఖ అధికారిగా ఒక బాధ్యత అప్పజెప్పితే ఆ బాధ్యతను చేయకుండా ఎవరిపైన కంప్లైంట్ చేశారో వారికే కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం దేనికి నిదర్శనమని తెలిపారు. తక్షణమే జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి డిప్యూటీ డిఈఓ సిసి గారి పైన ఎంక్వైరీ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అధికారిగా కాకుండా శ్రీ చైతన్య మరియు కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలకు వత్తాసుగా పనిచేస్తున్న డిప్యూటీ డిఈఓ సిసి గారిని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి చందు నగర అధ్యక్షులు మంజునాథ్ కోషధికారి నాని నాయకులు బాబ్జాన్ తేజ రాకేష్ సుశ్రీత్ దినేష్ దిలీప్ ఆఫన్ బాబీ బాలు తదితరులు పాల్గొన్నారు

Posted Under AP
Editor