ఇల్లూరు గ్రామంలో సమతుల్య ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన సదస్సు
ఇల్లూరు, మే 13 (ప్రతినిధి):
ఈరోజు (13-05-2026) ఇల్లూరు గ్రామంలో “సమతుల్య ఎరువుల వాడకం – రైతులకు అవగాహన సదస్సు” కార్యక్రమాన్ని ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు మండల వ్యవసాయ అధికారి శ్రీ సోమశేఖర్ తెలిపారు. ఈ సదస్సులో ఉద్యాన శాఖ శాస్త్రవేత్త డాక్టర్ త్రికల మాధవి రైతులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా చీనీ పంటలో రక్షక తడుల (Protective Irrigation) ప్రాముఖ్యతపై రైతులతో చర్చించారు. పంటల దిగుబడి మెరుగుపరచడానికి హరిత ఎరువులు, జీవన ఎరువులు వినియోగించి రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించాలని సూచించారు.
చీనీ, టమోటా, బెండ, వంగ, వేరుశెనగ, కంది వంటి పంటలకు సూటి ఎరువులతో పాటు సేంద్రీయ ఎరువులు వాడితే మంచి ఫలితాలు వస్తాయని వివరించారు. అధిక మోతాదులో రసాయనిక ఎరువులు వాడటం వల్ల నేల నాణ్యత తగ్గడం, దిగుబడిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని రైతులకు తెలియజేశారు.
అలాగే కెవికె (KVK) రెడ్డిపల్లి కేంద్రంలో టమోటా, మిరప, మునగ, బొప్పాయి మొక్కలు రైతులకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ త్రికల మాధవి, డాక్టర్ సుధారాణి, ముత్యాలరావు, VHA సంయుక్త, MPEO విజయలక్ష్మి మరియు పలువురు రైతులు పాల్గొన్నారు.
ఇల్లూరు గ్రామంలో సమతుల్య ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన సదస్సు..
