త్రాగునీటి సమస్యను పరిష్కరించండి,
సత్యసాయి వాటర్ సప్లై కార్మికుల సమస్యలను పరిష్కరించండి,
ఉరవకొండ నియోజకవర్గంలో నెలకొన్న త్రాగునీటి సమస్యపై జిల్లా అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్సీ వై శివరామరెడ్డి
(ఉరవకొండ- 13.05.2026)
ఉరవకొండ నియోజకవర్గంలో తీవ్ర త్రాగునీటి సమస్య నెలకొన్నదని, గత 15 రోజులుగా నియోజవర్గంలోని వివిధ మండలాలలో ప్రజలు
త్రాగునీటి సరఫరా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వ యంత్రాంగం మాత్రం చోద్యం చూస్తున్నారని ఎమ్మెల్సీ వై.శివరామరెడ్డి తెలిపారు. బుధవారం నాడు త్రాగునీటి సమస్యపై అనంతపురం జిల్లా ఆర్ డబ్ల్యూ ఎస్ సూపరిండెంటింగ్ ఇంజనీర్ మరియు సత్యసాయి త్రాగునీటి సరఫరా జిల్లా అధికారులతో ఆయన మాట్లాడారు, గత 15 రోజులుగా ఉరవకొండ నియోజకవర్గం లోని బెలుగుప్ప, వజ్రకరూరు, విడపనకల్లు మండలాల ప్రజలు త్రాగునీటికై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సత్యసాయి వాటర్ సప్లై కార్మికులు తమ సమస్యల పరిష్కారానికి సమ్మె చేస్తున్న కారణంగా త్రాగునీటి ఎద్దడి మరింత తీవ్రతరం అయిందని, సమస్య పరిష్కరించడానికి ఇంతవరకు ప్రభుత్వ యంత్రాంగం ప్రయత్నం చేయకపోవడం ఏమిటని వారిని ఎమ్మెల్సీ ప్రశ్నించారు. కార్మికుల సమ్మె చేస్తుంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం అయిందని, దీనితో నియోజకవర్గంలోని చాలా గ్రామాలలో త్రాగునీటి సమస్య నెలకొని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వేసవికాలం అవ్వటంతో ప్రజలతోపాటు పాడి పశువులకు కూడా త్రాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయని అధికారుల దృష్టికి ఎమ్మెల్సీ తీసుకెళ్లారు. దీనికి స్పందించిన అధికారులు సమస్య నెలకొన్న మాట వాస్తవమేనని, రెండు రోజుల్లో ఈ సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్సీ వై శివరామరెడ్డి గారికి హామీ ఇవ్వడం జరిగింది.
