గుంతకల్లు కేంద్రంగా రెండు కీలక రైల్వే సేవల ప్రారంభం..

అనంతపురం జిల్లా, గుంతకల్లు.

  • గుంతకల్లు కేంద్రంగా రెండు కీలక రైల్వే సేవల ప్రారంభం..
  • అనంతపురం జిల్లా రైల్వే అభివృద్ధిలో మరో చారిత్రాత్మక ఘట్టం
  • ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ చేతుల మీదుగా ప్రారంభమైన గుంతకల్లు – మార్కాపూర్ రోడ్ పాసింజర్ రైలు మరియు తిరుమల ఎక్స్‌ప్రెస్ విస్తరణ సేవలు
  • జిల్లా ప్రజల చిరకాల కోరిక నెరవేర్చిన కేంద్ర రైల్వే శాఖకు ఎంపీ అంబికా కృతజ్ఞతలు
  • -ఈ రైల్వే సేవల సాధనలో సహకరించిన నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు

– అనంతపురం జిల్లా ప్రజలకు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రెండు కీలక రైల్వే సేవలకు మంగళవారం గుంతకల్లు రైల్వే స్టేషన్‌లో ఘనంగా శ్రీకారం చుట్టారు. అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ నిరంతర కృషి ఫలితంగా మంజూరైన గుంతకల్లు – మార్కాపూర్ రోడ్ నూతన రోజువారీ పాసింజర్ రైలు (నెం. 57407/57408) మరియు తిరుమల ఎక్స్‌ప్రెస్ (18521/18522) సేవల విస్తరణను ఎంపీ జెండా ఊపి ప్రారంభించారు.

– ఈ సందర్భంగా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, అనంతపురం జిల్లా ప్రజల ప్రయాణ సౌకర్యాల మెరుగుదల కోసం తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉన్నామని తెలిపారు. గుంతకల్లు – మార్కాపూర్ రోడ్ రైలు సేవ సాధారణ ప్రజలకు, ముఖ్యంగా నంద్యాల, మార్కాపూర్ ప్రాంతాలకు ప్రయాణించే ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. అలాగే తిరుమల ఎక్స్‌ప్రెస్ గుంతకల్లు వరకు విస్తరణతో ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రయాణం మరింత సులభతరం అవుతుందని తెలిపారు.

– ఈ సేవల మంజూరుకు సహకరించిన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి, కేంద్ర సహాయ మంత్రి సోమన్న గారికి మరియు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారికి ఎంపీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ప్రయాణికులందరూ ఈ నూతన రైలు సేవలను వినియోగించుకొని సౌకర్యవంతమైన ప్రయాణాన్ని పొందాలని ఎంపీ కోరారు.

– ఈ కార్యక్రమంలో డీఆర్‌ఎం చంద్రశేఖర్ గుప్తా, ఏడీఆర్‌ఎం శివ ప్రసాద్, సీనియర్ డీసీఎం మనోజ్, సీనియర్ డీఓఎం ఎం.శ్రావణ్, సీనియర్ డీఎస్‌టీఈ చంద్రశేఖర్, లేబర్ అండ్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వెంకట శివుడు, ఆరెకటిక చైర్మన్ హరికృష్ణ, జిల్లా హాస్పిటల్ కమిటీ సభ్యులు నరసింహులు, ముష్టు భాస్కర్, డీఆర్‌సీ మెంబర్ శివప్రసాద్ గారు, యాదవ డైరెక్టర్ మస్తాన్, హ్యూమన్ రైట్స్ నాయకులు అఖిల్ నాయుడు, శ్రీనాథ్ గౌడ్, పవన్, హరి, రైల్వే అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor