శ్రీగీతం కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి…..

శ్రీగీతం కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

జిల్లా కేంద్రంలో ఉన్న శ్రీ గీతం కళాశాల యజమాన్యం పై వార్తలు రాసిన ఓ దినపత్రిక విలేకరి పై కరెస్పాండెంట్ మనీషా నాయర్ చెప్పుతో కొట్టి దౌర్జన్యం చేయడం తగదని, ఆమెపై చర్యలు తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిందనూరు నాగరాజు డిమాండ్ చేశారు. ఈవిషయంపై జిల్లా ఎస్పీని ఇదివరకే కలిశామని, కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారన్నారు. అయినా జాప్యం జరుగుతోందన్నారు. అలాగే “శ్రీ” అనే అక్షరాన్ని చిన్నగా రాసి, గీతం కళాశాల అనే అక్షరాలను పెద్దగా రాసి, విద్యార్థులను మోసం చేస్తున్న వైనం, కళాశాలలో పనిచేసే ఫ్యాకల్టీ లపై కూడా విచారణ చేసి, చర్యలు తీసుకోవాలని ఆరఓ నాయక్ కు కూడా పిర్యాదు చేశామన్నారు. అయితే ఆయన మనీషా నాయర్ పై గాని, కళాశాల పై గానీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఎందుకంటే ఆయనకు మనీషా నాయర్ ఇల్లు కట్టిస్తోందని, ఇప్పటికే బుల్లెట్ వాహనం కూడా ఇప్పించనట్లు ప్రచారం జరుగుతోంది కావున ఆయన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా ఆయన చర్యలు తీసుకోకపోతే ఆస్ఐఓ కార్యాలయం’ ముందు ధర్నా చేస్తామని చిందునూరు నాగరాజు హెచ్చరించారు.

Posted Under AP
Editor