నేమకల్లు అక్రమ క్వారీలు, క్రషర్ల దందాపై చర్యలేవి?

  • నేమకల్లు అక్రమ క్వారీలు, క్రషర్ల దందాపై చర్యలేవి?
  • సిగి
  • రూ.30 కోట్ల మేర అపరాధ రుసుం ఎగవేత
  • చంద్రబాబుకు బద్నాం తెస్తున్న టీడీపీ నాయకులు
  • ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామంటున్న బీఎస్పీ నాగరాజు

రాయదుర్గం నియోజకవర్గం, బొమ్మనహాళ్ మండలం నేమకల్లు గ్రామ పరిధిలో జరుగుతున్న అక్రమ క్వారీలు, క్రషర్ల దందాతో టీడీపీ నాయకులు కోట్లు గడిస్తున్నారు. ప్రభుత్వానికి కట్టాల్సిన రాయితీకి మాత్రం ఎగనామం పెడుతున్నారు. గత ప్రభుత్వంలో టీడీపీ నాయకుడు కాంతారావు క్వారీ మరియు క్రషర్ లో అక్రమాలు జరిగాయని గ్రహించిన మైన్స్ అండ్ జియాలజీ అధికారులు రూ.30 కోట్ల మేర అపరాధ రుసుం విధించారు. ఆ అపరాధ రుసుం కూడా చెల్లించకుండా చంద్రబాబు నా తమ్ముడు, మా వాడు అంటూ అధికారులను భయపెట్టి అక్రమ దందా కొనసాగిస్తున్నాడని, తద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబుకే బద్నాం తెస్తున్నాడని బీఎస్పీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి చిందనూరు నాగరాజు ఆరోపించారు. స్థానిక బీఎస్పీ పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి అంతా మా ఇష్టం, వేరే ప్రభుత్వం వస్తే మాకు దందా చేసుకోవడానికి వీలు ఉండదని, కాంతారావు బహిరంగంగానే చెప్పడం ఆయన బరితెగింపుకు నిదర్శనమన్నారు. ప్రతినెలా అక్రమ దందా జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు ఆపే ప్రయత్నం చేయకపోవడం వెనుక ఆంతర్యమేమిటో ? అని ప్రశ్నించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా క్రషర్, క్వారీ నడుపుతున్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళితే, అడిగిన వారి పేరును కాంతారావుకు చెప్పి, అతని ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఈ క్వారీ, క్రషర్ దందాల్లో టీడీపీ కి చెందిన ముఖ్యనాయుకుడు సహకారం అందిస్తున్నాడా? అనే ఆనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. లేకపోతే అక్రమ దందా ను అధికారులు ఎందుకు అడ్డుకోవడం లేదన్నారు. ఈ అక్రమ దందాపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో స్వయాన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ ముఖ్య నాయకులు గొల్ల నాగరాజు, కృష్ణ, తమ్మేపల్లి రాజు, గంగాధర, మల్లికార్జున, ఫకృద్దీన్, తిప్పేస్వామి, గణేష్, అంజి తదితరులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor