జూబ్లీహిల్స్‌లో దారుణం: రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్యను హత్య చేసిన పనిమనిషి

 

హైదరాబాద్, జూబ్లీహిల్స్.

జూబ్లీహిల్స్‌లో దారుణం చోటు చేసుకుంది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్(Retired IPS Officer Vinay Ranjan) భార్యను పనిమనిషి హత్య చేసింది.

హైదరాబాద్‌ : జూబ్లీహిల్స్‌లో దారుణం చోటు చేసుకుంది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్(Retired IPS Officer Vinay Ranjan) భార్య సునందను నేపాలీ పని మనిషి హత్య చేసింది. భారీగా బంగారం ఎత్తికెళ్లింది. పని మనిషితో పాటు ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నేపాలీ గ్యాంగ్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. సమాచారం అందుకున్న డీజీపీ సీవీ ఆనంద్‌, సీపీ సజ్జనార్‌ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Posted Under AP
Editor