నక్కపల్లిలో గోవుల అక్రమ రవాణా అడ్డుకున్న కరాటే కళ్యాణి బృందం.

అనకాపల్లి జిల్లా,పాయకరావుపేట.

  • నక్కపల్లిలో గోవుల అక్రమ రవాణా అడ్డుకున్న కరాటే కళ్యాణి బృందం
  • మూడు బొలెరో వాహనాల్లో 36 గోవుల తరలింపు.. పోలీసులకు అప్పగింత

అనకాపల్లి జిల్లా పాయకరావు పేట నియోజక వర్గం నక్కపల్లి లో గోవుల అక్రమ రవాణా ఘటన వెలుగులోకి వచ్చింది. జాతీయ రహదారిపై మూడు బొలెరో వాహనాల్లో సుమారు 36 గోవులను తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో గో సంరక్షణ సమితికి చెందిన కరాటే కళ్యాణి బృందం అప్ర మత్తమైంది. వాహనాలను అడ్డుకున్న బృందం..గోవుల తరలింపుపై ఆరా తీసి, అనంతరం మూడు బొలెరో వాహనాలతో పాటు గోవుల ను నక్కపల్లి పోలీస్ స్టేషన్‌కు అప్పగించింది. ఈ సందర్భం గా మీడియాతో మాట్లాడిన కరాటే కళ్యాణి.. గోవులను అక్రమంగా తరలించి సంపా దించే సొమ్ము ఎప్పటికీ నిలబడదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోవుల అక్రమ రవాణాపై ప్రభుత్వం, పోలీసు లు కఠిన చర్యలు తీసుకోవా లని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర హోం మంత్రి వంగలపూ డి అనిత ఈ ఘటనపై ప్రత్యేక దృష్టి సారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరా రు. ప్రస్తుతం పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు.

 

నక్కపల్లిలో గోవుల అక్రమ రవాణా అడ్డుకున్న కరాటే కళ్యాణి బృందం

* మూడు బొలెరో వాహనా ల్లో 36 గోవుల తరలింపు.. పోలీసులకు అప్పగింత

* నక్కపల్లిలో గోవుల అక్రమ రవాణా వెలుగు లోకి
*
* మూడు బొలెరో వాహనాల్లో 36 గోవుల తరలింపు
*
* వాహనాలను అడ్డుకుని పోలీసు లకు అప్పగించిన కరాటే కళ్యాణి బృందం

* అక్రమ సంపాదన ఎప్పటికీ నిలబడదని కళ్యాణి వ్యాఖ్యలు

* గోవుల అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవా లని డిమాండ్

* హోం మంత్రి అనిత స్పందించాలని కరాటే కళ్యాణి విజ్ఞప్తి

Posted Under AP
Editor