ముదిగుబ్బలో మండల సర్వసభ్య సమావేశం: తాగునీటి సమస్యలపై అధికారులకు ఎంపీపీ కీలక ఆదేశాలు

నేడు ముదిగుబ్బ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల అధ్యక్షులు శ్రీ గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ అధ్యక్షతన గురువారం సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో అన్ని శాఖల అభివృద్ధి, సమస్యల పై చర్చించడం జరిగింది
ముదిగుబ్బ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించడం జరిగింది. ఎక్కడైనా పంచాయతీల్లో నీటి సమస్యలు ఉన్నట్లయితే వెంటనే నా దృష్టికి తీసుకురావాలని సూచించడం జరిగింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను ఆదేశించడం జరిగింది.. శాఖల వారిగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులకు ఎంపీపీ గారు ఆదేశించడం జరిగినది. అలాగే మన రాష్ట్ర వైద్య, విద్య,ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రివర్యులు గౌరవ వై.సత్య కుమార్ యాదవ్ అన్నగారి సహకారంతో సమస్యలకు పరిష్కారం చూపుతామని తెలియజేశారు. అధికారులు బాధ్యతగా పనిచేసి ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు ఎంపీటీసీలు పంచాయతీ సెక్రెటరీ ఇతరులు పాల్గొన్నారు జరిగింది…

Posted Under AP
Editor