రైతులకు అండగా ఎంపీపీ ఆదినారాయణ..

రైతులకు అండగా ఎంపీపీ ఆదినారాయణ
జొన్నలకొత్తపల్లిలో 500 క్వింటాళ్ల వేరుశనగ పంపిణీ…
జొన్నలకొత్తపల్లి గ్రామపంచాయతీలో రైతులకు ఊరటనిచ్చే కార్యక్రమం నిర్వహించారు.
అతియా ఫార్మా అనే ఎన్జీవో సంస్థ ఆధ్వర్యంలో, ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ నేతృత్వంలో సుమారు 500 క్వింటాళ్ల వేరుశనగలను రైతులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎంపీపీ ఆదినారాయణ మాట్లాడుతూ రైతుల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రకృతి విపత్తులు, సాగు ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో రైతులకు తోడ్పాటు అందించడం ఎంతో అవసరమన్నారు. రైతులు ఆర్థికంగా బలోపేతం కావడానికి ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేయడం అభినందనీయమని చెప్పారు.
గ్రామస్థులు, రైతులు మాట్లాడుతూ రైతులకు అవసరమైన సమయంలో వేరుశనగ పంపిణీ చేయడం ఎంతో ఉపయోగకరంగా ఉందని పేర్కొన్నారు. ఎంపీపీ ఆదినారాయణ రైతుల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ సహాయ సహకారాలు అందించడం ప్రశంసనీయమని అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ కన్వీనర్ ప్రభాకర్ క్లస్టర్ ఇంచార్జ్ తుమ్మల మనోహర్ జాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు

Posted Under AP
Editor