Latest Posts

శాంతిభద్రతల విషయంలో రాజీ పడొద్దు…..

శాంతిభద్రతల విషయంలో రాజీ పడొద్దు.
రామగిరి నూతన సిఐకి ఎమ్మెల్యే పరిటాల సునీత సూచన.
ఎమ్మెల్యే సునీత, పరిటాల శ్రీరామ్ లతో సీఐ మహమ్మద్ అలీ మర్యాదపూర్వక భేటీ.
అనంతపురం. మే 05.
శాంతి భద్రతల విషయంలో రాజీ లేకుండా పనిచేయాలని రామగిరి నూతన సీఐ ఎస్.కె మహమ్మద్ అలీ కి రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సూచించారు. రామగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా నియమితులైన మహమ్మద్ అలీ మంగళవారం అనంతపురంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరం టీడీపీ ఇన్ ఛార్జ్ పరిటాల శ్రీరామ్ లతో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. రామగిరి సర్కిల్ పరిధిలోని అంశాల గురించి వారు చర్చించారు. సర్కిల్ పరిధిలో ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చినా స్నేహ పూర్వకంగా చెప్పుకునే వాతావరణం ఉండాలని వారు సూచించారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా సరే.. ఏ పార్టీకి చెందిన వారైనా సరే కఠినంగా వ్యవహరించాలన్నారు. పోలీసుల విధి నిర్వహణకు తమ సహకారం ఎప్పటికీ ఉంటుందన్నారు.

Posted Under AP
Editor