- కౌకుంట్లలో 2 రోజు మంత్రి పయ్యావుల కేశవ్ పిజిఆర్ఎస్ స్వీకరణ
- జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన మంత్రి
- సామాన్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యం..
- రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్
- సత్వరమే సమస్యలను పరిష్కరించాలి : అధికారులకు మంత్రి ఆదేశం..
అనంతపురం, మే 05 :
– *సామాన్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా, వరుసగా 2వ రోజు మంగళవారం ఉరవకొండ మండలం కౌకుంట్ల గ్రామంలో రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ – పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని నిర్వహించారు.*
– *ఈ సందర్భంగా నియోజకవర్గం నలుమూలల నుండి వివిధ సమస్యలతో తరలివచ్చిన బాధితులు, నాయకులు, ప్రజలతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని, వారి నుండి అర్జీలు స్వీకరించారు. ప్రజల సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. కార్యక్రమానికి హాజరైన ప్రజల కోసం భోజన ఏర్పాట్లు కూడా చేశారు.*
– *ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. సామాన్య ప్రజల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. అలాగే, తమ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిరంతరం నిర్వహిస్తూ, అందులో వచ్చిన సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు.*
