మొలగవల్లిలో విషాదం.. గౌరమ్మ అంతిమయాత్రకు జనసంద్రం

కర్నూల్ జిల్లా…. ఆలూరు

 

ఆలూరు మండలం మొలగవల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సిపిఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ తల్లి గౌరమ్మ అంత్యక్రియలు ఘనంగా నిర్వహించబడ్డాయి. వేలాది మంది ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు హాజరై కన్నీటి వీడ్కోలు పలికారు.
తల్లి పట్ల అపారమైన ప్రేమను చాటుతూ కె. రామకృష్ణ స్వయంగా పాడె మోసి అంతిమయాత్రలో పాల్గొనడం అందరినీ భావోద్వేగానికి గురిచేసింది. రాజకీయ భేదాలను పక్కనపెట్టి సిపిఐ, టిడిపి, వైఎస్సార్సీపీ, కాంగ్రెస్, జనసేన నాయకులు ఒకే వేదికపై చేరి గౌరమ్మకు నివాళులర్పించారు.
నిరాడంబర జీవితం గడిపిన గౌరమ్మ కుటుంబ విలువలకు ప్రతీకగా నిలిచారని పలువురు కొనియాడారు. గ్రామస్తులు, మహిళలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో హాజరై కన్నీటి వీడ్కోలు పలికారు.
ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్‌లో కె. రామకృష్ణను పరామర్శించి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
గౌరమ్మ అంత్యక్రియలు… ఒక కుటుంబ కార్యక్రమం కాకుండా ప్రజల హృదయాలను కదిలించిన సంఘటనగా మారాయి.

Posted Under AP
Editor